బాపుగారి సినిమాల్లో నటించకుండానే బాపుబొమ్మ అయి కూర్చుంది ప్రణీత. ‘అత్తారింటికి దారేది’ పుణ్యమా అని ఈ ముద్దుగుమ్మను అందరూ బాపు బొమ్మా అనే అంటున్నారు.
బాపుగారి సినిమాల్లో నటించకుండానే బాపుబొమ్మ అయి కూర్చుంది ప్రణీత. ‘అత్తారింటికి దారేది’ పుణ్యమా అని ఈ ముద్దుగుమ్మను అందరూ బాపు బొమ్మా అనే అంటున్నారు. ప్రస్తుతం ఈ బాపు బొమ్మ తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో మొదటిది ఎన్టీఆర్ ‘రభస’ కాగా, రెండోది మంచు ఫ్యామిలీ సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెదా’. అయితే... ఈ రెండు చిత్రాల్లోనూ ప్రణీతను సెకండ్ హీరోయిన్ పాత్రలే వరించాయి. 

