ఆయనతో వివాదం లేదు : ప్రభాస్‌

Prabhas Speak Up On His Fight With Karan Johar - Sakshi

బాహుబలి ప్రభాస్‌కు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌కు మధ్య కోల్డ్ వార్‌ జరుగుతున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌ను కరణ్‌ బాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు ప్రయత్నించటం. అందుకు ప్రభాస్‌ నో చెప్పటంతో వారిద్దరి మధ్య దూరం పెరిగిందన్న టాక్‌ టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో హాట్‌ టాపిక్‌గా మారింది.

తాజాగా ఈ విషయంపై స్పందించిన యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అవన్నీ రూమర్స్‌ అంటూ కొట్టిపారేశారు. మీడియాలో తమ మధ్య వివాదం నడుస్తున్నట్టుగా వార్తలు వచ్చిన విషయం కరణ్‌ తనకు ఫోన్‌చేసి చెప్పారన్నారు. మా మధ్య ఎలాంటి వివాదం లేదని క్లారిటీ ఇచ్చారు. దుబాయ్‌లో షూటింగ్ పూర్తియిన సందర్భంగా అక్కడి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌ ఈ విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top