సాహో టీజర్‌ రివ్యూ.. వావ్‌ అనిపించిన ప్రభాస్‌

Prabhas Saaho Teaser Review - Sakshi

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్‌ మూవీ సాహో. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్. జాతీయ స్థాయిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు అదే స్థాయిలో టీజర్‌ను కట్ చేశారు. ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్‌తో పాటు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు టీజర్‌లో కనువిందు చేశాయి.

టీజర్‌లో ప్రధాన పాత్రలను పరిచయం చేసిన మేకర్స్‌, ప్రభాస్‌ హీరోయిజాన్ని అద్భుతంగా ఎలివేట్ చేశారు. కథా కథనాలపై కూడా హింట్‌ ఇచ్చి సినిమా మీద అంచనాలను పెంచేశారు. ఒక నిమిషం 40 సెకన్ల టీజర్‌లో యాక్షన్స్‌ సీన్స్‌ హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ప్రభాస్‌పై తెరకెక్కించిన కార్‌, బైక్‌ చేజ్‌లతో సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో టేస్ట్ చూపించారు. అయితే టీజర్‌లో ఎక్కువగా యాక్షన్‌ షాట్సే ఉండటంతో కాస్త గజిబిజీగా అనిపిస్తుంది.

బాహుబలితో అం‍తర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ రేంజ్‌ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కటం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్‌లో ప్రభాస్‌ను హాలీవుడ్ హీరో స్థాయిలో స్టైలిష్ లుక్‌లో ప్రజెంట్ చేశారు. అదే సమయంలో ప్రభాస్‌ కామెడీ టైమింగ్‌ను కూడా చూపించారు.

టీజర్‌లో సినిమాలోని క్యారెక్టర్స్‌ను ఆర్టిస్ట్‌లను పరిచయం చేసేందుకు ప్రధాన్యత ఇచ్చారు. ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న శ్రద్ధాకపూర్‌, మెయిన్ విలన్‌ నీల్‌ నితిన్‌ ముఖేష్‌లతో పాటు అరుణ్ విజయ్‌, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్‌, మహేష్ మంజ్రేకర్‌, మందిరా బేడి, ఎవ్లిన్‌ శర్మ, వెన్నెల కిశోర్‌లను టీజర్‌లోనే పరిచయం చేశారు.

సినిమాలో గ్రాఫిక్స్‌ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో కూడా టీజర్‌లోనూ చూపించేశారు. విదేశాల్లో చిత్రీకరించిన యాక్షన్‌ సీన్స్‌ ఏరియల్‌ షాట్స్‌ కన్నార్పకుండా చూసేలా ఉన్నాయి. టీజర్‌ను చూస్తే ఓ యాక్షన్‌ సినిమాకు కావాల్సిన స్థాయికన్నా ఎక్కువగానే గ్రాఫిక్స్‌ వాడినట్టుగా అనిపిస్తుంది. అయితే సినిమాలో యాక్షన్‌, ప్రభాస్‌తో పాటు విజువల్‌ ఎఫెక్ట్స్ కూడా కీ రోల్‌ ప్లే చేయనున్నాయి.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన సాహో అంతర్జాతీయ స్థాయిలో విడుదలకు రెడీ అవుతోంది. బాహుబలితో జాతీయ స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్ సాధించిన ప్రభాస్‌ ఈ సినిమాతో నేషనల్‌ ఆడియన్స్‌కు మరింత దగ్గరవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా హాలీవుడ్‌ స్థాయి కాన్సెప్ట్‌తో పాన్‌ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సాహో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top