నయా లుక్‌

prabhas radhakrishna kumar new movie jaan - Sakshi

సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనే ఆలోచనలో ప్రభాస్‌ ఉన్నారని టాక్‌. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 1950–70ల కాలంలో ఇటలీలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాలో ప్రభాస్‌ లుక్‌ విభిన్నంగా ఉండబోతుందట.

దానికి సంబంధించిన వర్కౌట్‌ మొదలుపెట్టనున్నారు ప్రభాస్‌. ఆల్రెడీ ఓ పదిహేను శాతం షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా అక్టోబర్‌ చివర్లో మళ్లీ ప్రారంభం కానుంది. ఆల్రెడీ షూటింగ్‌ మొదలుపెట్టాక వర్కౌట్‌ ఏంటీ? అని ఆలోచిస్తున్నారా? ఈ చిత్రంలో ప్రభాస్‌ డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తారని టాక్‌. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ‘జాన్‌’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top