 
													
ప్రభాస్ తదుపరి మూవీకి సంబంధించి ఛేజింగ్ సీన్‌ను తెరకెక్కించామని నిర్మాతలు వెల్లడించారు.
హైదరాబాద్ : సాహో తర్వాత ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ నుంచి తాజా అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ ఛేజింగ్ సీన్‌లో ప్రభాస్ పాల్గొన్న దృశ్యాలను షూట్ చేసినట్టు యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. గ్లోబల్ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యేలా ప్రభాస్ 20 మూవీని నిర్మాతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంతర్జాతీయ ప్రొఫెషనల్స్ సహకారంతో ఈ సీన్‌ను తెరకెక్కించామని, ఇక యూరప్‌లో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశామని, మరిన్ని అప్‌డేట్స్ త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు.
ఇక చిత్ర బృందం 20 రోజుల షెడ్యూల్ కోసం జార్జియా బయలుదేరింది. మార్చి 15 నుంచి 20 రోజుల పాటు జార్జియాలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారు. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, పూజా హెగ్డేలతో పాటు ప్రధాన తారాగణంపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్ అనంతరం కొద్దిరోజుల విరామం అనంతరం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతుంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
A cute chase sequence with a terrific international crew has been completed. A long schedule in Europe awaits now. More updates soon! #Prabhas20
— UV Creations (@UV_Creations) March 10, 2020

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
