ప్రభాస్‌ కోసం హైదరాబాద్‌లో యూరప్‌!

Prabhas And Radha Krishna Movie Update - Sakshi

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. బాహుబలి లాంటి ఘన విజయం తరువాత తెరకెక్కుతున్న సినిమా కావటంతో సాహోను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల దుబాయ్‌లో 40 రోజుల పాటు యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరించారు. త్వరలో మరో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే నెక్ట్స్‌ సినిమాను రెడీ చేస్తున్నాడు ప్రభాస్‌.

జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా కోసం హైదరబాద్‌లో యూరప్‌ లోకేషన్లను సెట్‌ వేస్తున్నారట. అక్కడి ట్రైన్‌, షిప్‌, హెలికాప్టర్‌ లాంటి వాటిని కూడా హైదరాబాద్‌లో సెట్‌ వేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top