ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త

Power Packed Teaser Getting Ready For Saaho - Sakshi

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్‌ అడ్వంచరస్‌ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఓ టీజర్‌ తో సందడి చేసిన సాహో యూనిట్‌, తరువాత ఒక్క పోస్టర్‌ను మాత్రమే రిలీజ్ చేసింది.

ప‍్రస్తుతం సాహో సినిమాకు సంబంధించిన వార్తలు పెద్దగా వినిపించటం లేదు. సినిమా మీద బజ్‌ క్రియేట్ చేసేందుకు చిత్రయూనిట్‌ ఓ టీజర్‌ ను రెడీ చేస్తోందట. దుబాయ్‌ షెడ్యూల్ పూర్తయిన తరువాత ఈ టీజర్‌ ను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు శంకర్‌ ఇషాన్‌ లాయ్‌లు సంగీతమందిస్తున్నారు. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top