కొత్త ప్రయాణం | Pooja Bhatt Shares An Update On Mahesh Bhatt's Sadak 2 | Sakshi
Sakshi News home page

కొత్త ప్రయాణం

Nov 5 2018 2:46 AM | Updated on Nov 5 2018 2:46 AM

Pooja Bhatt Shares An Update On Mahesh Bhatt's Sadak 2 - Sakshi

‘సడక్‌ 2’ ప్రయాణం మొదలైంది. ఈ చిత్రం కోసం లొకేషన్‌ సెర్చ్‌ స్టార్ట్‌ చేశారు దర్శకుడు మహేశ్‌ భట్‌. తన 70వ పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌ భట్‌ ‘సడక్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఆయన దర్శకత్వం వహించనున్న చిత్రమిదే కావడం విశేషం. 1999లో మహేశ్‌ భట్‌ చివరగా ‘కార్‌తూస్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘సడక్‌ 2’ కి సన్నాహాలు మొదలెట్టారు. 1991లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సడక్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఇందులో సంజయ్‌ దత్, పూజాభట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్‌ కపూర్‌ కీలక పాత్రల్లో నటించనున్నారు. ‘‘సడక్‌ 2’ ప్రయాణం అధికారికంగా మొదలైంది. లైఫ్‌ను మార్చే కొత్త ప్రయాణం ఆరంభమైన అనుభూతి కలుగుతోంది. డెహ్రాడూన్, కేదార్‌నాథ్‌ ప్రదేశాలను షూటింగ్‌ కోసం పరిశీలించాం’’అన్నారు పూజాభట్‌. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement