ఢిల్లీ టు స్విట్జర్లాండ్‌

Payal Rajput shares a selfie with Ravi Teja from the sets of Disco Raja - Sakshi

రాజా ప్రయాణ ప్రణాళిక సిద్ధమైంది. ఇక ఫ్లైట్‌ ఎక్కడమే ఆలస్యం. రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రామ్‌ తాళ్ళూరి నిర్మిస్తున్న చిత్రం ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిసింది.

రవితేజ, పాయల్‌ రాజ్‌పుత్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఆగస్టు 4న ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ‘డిస్కో రాజా’ టీమ్‌ స్విట్జర్లాండ్‌ వెళ్లనుంది. అక్కడ పాటల చిత్రీకరణను ప్లాన్‌ చేశారట. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కాకుండా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ అనే సినిమాలో రవితేజ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top