మరోసారి, పవన్.. త్రివిక్రమ్.. సమంత..! | Pawan Kalyan, Trivikram movie launch on Nov 5 | Sakshi
Sakshi News home page

మరోసారి, పవన్.. త్రివిక్రమ్.. సమంత..!

Oct 26 2016 12:58 PM | Updated on Mar 22 2019 5:33 PM

మరోసారి, పవన్.. త్రివిక్రమ్.. సమంత..! - Sakshi

మరోసారి, పవన్.. త్రివిక్రమ్.. సమంత..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న రెండేళ్లు వరుస సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. 2019 ఎన్నికల్లో పాల్గొనే ఆలోచన ఉన్న పవన్, ఈ లోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేందుకు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న రెండేళ్లు వరుస సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. 2019 ఎన్నికల్లో పాల్గొనే ఆలోచన ఉన్న పవన్, ఈ లోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. సర్థార్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ ప్రస్తుతం జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఏఎమ్ రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో ఓ సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు. తాజాగా మరో సినిమాను కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు పవర్ స్టార్.

జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమాను మొదలు పెట్టనున్నాడు. దేవుడే దిగి వచ్చినా పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను నవంబర్ 5న లాంచనంగా ప్రారంభించనున్నారు. సమంత హీరోయిన్గా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో ప్రారంభమవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement