నా మొదటి ప్రేమికుడాయనే! | Parvathy Nair Comment On Ajith Kumar | Sakshi
Sakshi News home page

Dec 9 2018 7:49 AM | Updated on Dec 9 2018 8:08 AM

Parvathy Nair Comment On Ajith Kumar - Sakshi

తమిళసినిమా: నా మొదటి ప్రేమికుడు ఆయనే అని చెబుతోంది నటి పార్వతీ నాయర్‌. దుబాయ్‌లో పుట్టి పెరిగిన ఈ మలయాళీ భామ తొలుత మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించి ఆ తరువాత వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో మాతృభాషా చిత్రాలకే పరిమితం అయినా ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడం అంటూ దక్షిణాది సినిమాను తిరగేస్తోంది. అయితే గ్లామర్‌కు హద్దులు లేవన్నట్లు అందాలారబోతకు సిద్ధం అంటున్నా, ఇంకా ఈ బ్యూటీకి సరైన హిట్‌ పడలేదనే చెప్పాలి. కోలీవుడ్‌లో జయంరవితో కలిసి నిమిర్న్‌దు నిల్‌ చిత్రంతో కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన పార్వతీనాయర్‌ ఆ తరువాత అజిత్‌తో కలిసి గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ఎన్నై అరిందాల్‌ చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్‌లో నిమిర్, శాంతనుతో కోడిట్ట ఇడంగళై నిరంబుగ చిత్రాల్లో కథానాయకిగా నటించింది.

ప్రస్తుతం విజయ్‌సేతుపతితో కలిసి నటించిన సీతాక్కాది చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో ప్రేమ గురించి మాట్లాడుతూ తనకు పాఠశాలలో చదువుకునే వయసులోన పలువురిపై ప్రేమ పుట్టిందని చెప్పింది. అలా తన మొదటి ప్రేమికుడు నటుడు అజిత్‌నేనని పేర్కొంది. అలాంటిది తాను ఆయనతో ఎన్నైఅరిందాల్‌ చిత్రంలో నటించే అకాశం కలగడం మరచిపోలేని అనుభవం అని అంది. సాధారణంగా ఏ హీరోయిన్‌కైనా నటుడు అజిత్‌తో కలిసి ఒక్క చిత్రంలో ఒక్క సన్నివేశంలోనైనా నటించాలన్న ఆశ ఉంటుంది. నటి పార్వతీనాయర్‌ కూడా అలాంటి కోరికతోనే ఎన్నై అరిందాల్‌ చిత్రంలో అజిత్‌తో కాకపోయినా ఆయన చిత్రంలో తానుండాలని, నటుడు అరుణ్‌విజయ్‌కు జంటగా నటించిదట. అజిత్‌ అంటే సినీమా హీరోయిన్లే కాదు సాధారణ యువతులు ఇష్టపడతారు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది మరి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement