ఈసారైనా... వస్తారా | Parmanu to release on May 25, will clash with Bhavesh Joshi | Sakshi
Sakshi News home page

ఈసారైనా... వస్తారా

Apr 26 2018 1:21 AM | Updated on Apr 26 2018 1:21 AM

Parmanu to release on May 25, will clash with Bhavesh Joshi  - Sakshi

జాన్‌ అబ్రహాం

వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.. హిందీ మూవీ ‘పరమాణు’ థియేటర్‌లోకి రావడానికి. నిజానికి ఈ సినిమాను గతేడాది డిసెంబర్‌లో రిలీజ్‌ చేద్దాం అనుకున్నారు. ‘పద్మావతి’ మూవీ ఎఫెక్ట్‌తో కుదర్లేదు. అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్‌కు మోక్షం లభించలేదు. రీసెంట్‌గా నిర్మాతలకు గొడవలు అయ్యాయి. అంతే.. సినిమా రిలీజ్‌పై అనుమానాలు కలిగాయి. ఎట్టకేలకు ఇప్పుడు మరో రిలీజ్‌ డేట్‌ను ఎనౌన్స్‌ చేసింది చిత్రబృందం. మే 25న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. మరి.. ఈసారైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో? లేదో తెలియాలంటే మరో నెల రోజులు ఆగక తప్పదు.

జాన్‌ అబ్రహాం,  డయానా పెంటీ, బొమన్‌ ఇరానీ ముఖ్య తారలుగా అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పరమాణు’. క్రీర్జ్‌ ఎంటర్‌టైన్‌మెంట్, జేఏ ఎంటర్‌టైన్‌మెంట్, జీ స్టూడియోస్, కైట ప్రొడక్షన్స్‌ నిర్మించాయి. పొఖ్రాన్‌–2 అణుపరీక్షల బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను తెరకెక్కించారు. ‘‘చరిత్రను చూపించడం అంత ఈజీ కాదు. న్యూక్లియర్‌ స్టేట్‌కి వచ్చే దారి ఫుల్‌ ఆఫ్‌ చాలెంజెస్‌తో ఉంది. సినిమాను మే 25న రిలీజ్‌ చేయనున్నాం’’ అని జాన్‌ అబ్రహాం పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement