మూడు తరాల కథతో జగన్నాయకుడు | P.C.Reddy directs 'Jaganayakudu' movie | Sakshi
Sakshi News home page

మూడు తరాల కథతో జగన్నాయకుడు

Feb 15 2014 12:34 AM | Updated on Sep 2 2017 3:42 AM

మూడు తరాల కథతో జగన్నాయకుడు

మూడు తరాల కథతో జగన్నాయకుడు

కృష్ణ, శ్రీదేవి జంటగా పీసీ రెడ్డి దర్శకత్వంలో గతంలో ‘భోగభాగ్యాలు’ వంటి విజయవంతమైన చిత్రం నిర్మించిన వీఏ పద్మనాభరెడ్డి ప్రస్తుతం ‘జగన్నాయకుడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కృష్ణ, శ్రీదేవి జంటగా పీసీ రెడ్డి దర్శకత్వంలో గతంలో ‘భోగభాగ్యాలు’ వంటి విజయవంతమైన చిత్రం నిర్మించిన వీఏ పద్మనాభరెడ్డి ప్రస్తుతం ‘జగన్నాయకుడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా పీసీ రెడ్డి దర్శకుడు. రాజా, మమతారాహుల్, శిరీష ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రం నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్‌లో ప్రారంభమైంది.
 
 ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం పాట చిత్రీకరిస్తున్నాం. 30 రోజుల పాటు బద్వేలు పరిసర ప్రాంతాల్లోను, ఇతర గ్రామాల్లోను షూటింగ్ చేస్తాం. ఆరు పాటలను రికార్డ్ చేశాం. ఏప్రిల్‌లో సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. పీసీ రెడ్డి మాట్లాడుతూ -‘‘మూడు తరాల కథతో ఈ సినిమా ఉంటుంది. తాత, తండ్రీకొడుకుల పాత్రలు ప్రధానంగా ఉంటాయి. కొడుకు పాత్రను రాజా, ఆయన తాతగా రంగనాథ్, తండ్రిగా భానుచందర్ చేస్తున్నారు’’ అని చెప్పారు. కథ, తన పాత్ర బాగున్నాయని రాజా అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సింహప్రసాద్, సంగీతం: ప్రమోద్‌కుమార్.

Advertisement
 
Advertisement
Advertisement