
బాలీవుడ్ సినిమాపై ఎన్టీఆర్ ట్వీట్
సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా కనిపించిన యంగ్ హీరో ఎన్టీఆర్ సోషల్ మీడియా పేజ్లో ఇంట్రస్టింగ్ ట్వీట్ ఒకటి దర్శనమిచ్చింది.
సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా కనిపించిన యంగ్ హీరో ఎన్టీఆర్ సోషల్ మీడియా పేజ్లో ఇంట్రస్టింగ్ ట్వీట్ ఒకటి దర్శనమిచ్చింది. పెద్దగా ఇతర హీరోల సినిమాల గురించి ట్వీట్ చేయని ఎన్టీఆర్ ఈ మధ్య బాబాయ్ హీరోగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి టీంకు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ ఇప్పుడు ఓ బాలీవుడ్ హీరో సినిమాకు విషెస్ చెప్పాడు.
సౌత్లో విలన్గా సోపోర్టింగ్ ఆర్టిస్ట్గా నటించిన విద్యుత్ జమాల్ బాలీవుడ్లో హీరోగా తెరకెక్కిన సినిమా కమాండో. ఈ సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న కమాండో 2 తెలుగులో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఎన్టీఆర్ జమాల్కు విషెస్ చెప్పాడు. 'నా ప్రియమైన స్నేహితుడు విద్యుత్ జమాల్ హీరోగా తెరకెక్కిన కమాండో 2 తెలుగులో వస్తోంది. అతడికి ఆల్ ద బెస్ట్' అని ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన శక్తి, ఊసరవెల్లి సినిమాల్లో జమాల్ కీలక పాత్రల్లో నటించాడు.
Wishing my dear friend @VidyutJammwal the very best for his #Commando2 in Telugu https://t.co/oNIEANH9gb
— tarakaram n (@tarak9999) 28 January 2017