చిట్టి... స్టిల్‌ ఎలైవ్‌!

This new still of Rajinikanth as Chitti from 2.0 will get you excited for the film - Sakshi

యస్‌... చిట్టి ఇంకా బతికున్నాడు. ‘రోబో’లో రచ్చ రంబోలా చేశాడు. గుర్తుందా? ఆ చిట్టీనే! ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ! అసలు చావడానికి చిట్టి మనిషయితేగా... రోబో! మరి, రోబో చావడం ఏంటి? అనొచ్చు. ఎంత రోబో అయినా... మనిషికున్న ఫీలింగ్స్‌ చిట్టీకి ఉన్నాయి కదా! ‘రోబో’ ఎండింగ్‌లో తనకు తానుగా బాడీలో పార్టులను విప్పేసుకుంటుంది చిట్టి. ‘రోబో’కి సీక్వెల్‌గా వస్తున్న ‘2.0’లో చిట్టీని మళ్లీ ఎలా తీసుకొస్తున్నారో? ప్రస్తుతానికి న్యూ లుక్‌ని మాత్రం చూపించారు దర్శకుడు శంకర్‌.

యస్‌... ‘2.0’లో చిట్టి న్యూ లుక్కునే మీరు చూస్తున్నారిప్పుడు! ఫేస్‌ పెద్దగా మారలేదు గానీ... కాస్ట్యూమ్స్‌ సూపరున్నాయి. ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చిందీ లుక్‌. రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో సుమారు 450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా పాటలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేస్తామని చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది.

అయితే... పాటలు విడుదలైన తర్వాత సినిమా విడుదల ఏప్రిల్‌ 13కు వాయిదా వేశారనే వార్తలొచ్చాయి. వీటిపై రజనీ గానీ, చిత్రబృందం గానీ స్పందించలేదు. మరి, సినిమా ఎప్పుడు విడుదలవుతుందో? హిందీ హీరో అక్షయ్‌కుమార్‌ యాంటీ హీరోగా, బ్రిటన్‌ బ్యూటీ అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top