జుంగాలో నేహా | Neha Sharma to play the second heroine in Junga? | Sakshi
Sakshi News home page

జుంగాలో నేహా

Nov 23 2017 5:41 AM | Updated on Nov 23 2017 5:41 AM

Neha Sharma to play the second heroine in Junga?  - Sakshi

తమిళసినిమా: నటి నేహా శర్మ గుర్తుందా? ఇటీవల విడుదలైన సోలో చిత్రంలో నటుడు దుల్కర్‌సల్మాన్‌తో రొమాన్స్‌ చేసిన ఐదుగురు ముద్దుగుమ్మల్లో ఒకరీ భామ. తాజాగా మరో అవకాశాన్ని తన జేబులో వేసుకుంది. యువ నటుడు విజయ్‌సేతుపతి కథాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జుంగా. తనే రూ.20 కోట్ల భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్న ఇందులో ఇప్పటికే ముంబై బ్యూటీ సాయేషాసైగల్‌ నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ఫ్రాన్స్‌లో పాట చిత్రీకరించుకుంటోంది. రాజుసుందరం నృత్య దర్శకత్వంలో పాటను చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని చిత్రం యూనిట్‌ ఇప్పటికే ప్రకటించారు. రెండవ హీరోయిన్‌గా నటి నేహాశర్మను ఎంపిక చేయడానికి చర్చలు జరగుతున్నాయని చిత్ర దర్శకుడు గోకుల్‌ తెలిపారు. దీని గురించి ఆయన చెబుతూ రెండవ హీరోయిన్‌గా నటి నేహా శర్మను నటింపచేయడానికి చర్చలు జరగుతున్నాయని, అయితే ఇంకా ఆమె ఒప్పదంపై సంతకాలు చేయలేదని, తను కాల్‌షీట్స్‌ సర్దుబాటు చేసుకుని ఇస్తాననడంతో ఆమెకు సంబంధించిన సన్నివేశాలను డిసెంబర్, జనవరిలో గానీ చిత్రీకరించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో నేహాశర్మ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఆమె లంగాఓణీ పాత్రలో చిన్నపాటి డాన్‌లా కనిపిస్తుందని అన్నారు. విజయ్‌సేతుపతితో నేహాకు ఒక డ్యూయెట్‌ కూడా ఉంటుందని చెప్పారు. విజయ్‌సేతుపతి, గోకుల్‌ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఇదర్కుదానే ఆశైపట్టాయ్‌ బాలకుమారా వంటి విజయవంతమైన చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. జుంగా ఈ హిట్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండవ చిత్రం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement