కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

Nani replaces Jr NTR as Bigg Boss Telugu host - Sakshi

గెట్‌ రెడీ! కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఏదైనా జరగొచ్చు! మీ హౌస్‌లోకి బిగ్‌ బాస్‌ వస్తున్నాడు. ఎప్పటి నుంచో తెలుసా? జూన్‌ 10 నుంచి. అంటే సరిగ్గా.. ఇవాళ్టి నుంచి పదకొండు రోజుల తర్వాత. మరి.. బిగ్‌బాస్‌ సీజన్‌ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా? వంద రోజులు. బిగ్‌ బాస్‌ హౌస్‌లో 16మంది పార్టిసిపెంట్స్‌ హంగామా చేసి వీక్షకులను అలరించబోతున్నారు. తొలి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో సీజన్‌కు నానీ హోస్ట్‌. ‘‘జూన్‌ 10 నుంచి ప్రారంభం. 100 రోజులు. 16 సెలబ్రిటీలు. 1 బిగ్‌ బాస్‌ హౌస్‌’’ అని నానీ పేర్కొన్నారు. సో.. జూన్‌ 10 నుంచి సెకండ్‌ బిగ్‌ బాస్‌ హంగామా మొదలవుతుంది. అలరించే పార్టిసిపెంట్స్‌ ఎవరో కూడా అతి త్వరలో తెలిసిపోతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top