గ్యాంగ్‌ రెడీ అవుతోంది

NANI NEW MOVIE IS GANG LEADER - Sakshi

ఒక చిన్నపాప, టీనేజ్‌ అమ్మాయి, ఇరవై రెండేళ్ల అమ్మాయి, అమ్మ.. బామ్మ.  వీళ్లందరి వెనక ఒక్కడున్నాడు. ఐదు వేళ్లకు సపోర్ట్‌ ఇచ్చే అరచేతిలా, పాండవులను రక్షించిన శ్రీకృష్ణుడిలా. ఆ గ్యాంగ్‌కి లీడర్‌ నాని. మరి ఈ గ్యాంగ్‌ ఏం చేసింది? ఈ గ్యాంగ్‌ను ఆ గ్యాంగ్‌లీడర్‌ ఎలా రక్షించాడు? అనే కాన్సెప్ట్‌తో నాని లేటెస్ట్‌ చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’ తెరకెక్కుతోంది. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఫుల్‌ స్పీడ్‌లో జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ స్టూడియోలో వేసిన సెట్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేసింది చిత్రబృందం. నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఈ వారంలో స్టార్ట్‌ కానుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా కనిపిస్తారు. అరుళ్‌ మోహనన్‌ కథానాయికగా పరిచయం అవుతున్నారు. అనిరు«ద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ నెలలో రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top