‘గ్యాంగ్‌ లీడర్‌ అందరినీ మెప్పిస్తాడు’

Nani Confident on Gang Leader Movie Success - Sakshi

ఈ శుక్రవారం గ్యాంగ్‌ లీడర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న యంగ్ హీరో నాని, ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని సినిమా సక్సెస్‌పై ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు నాని. కామెడీ రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు విక్రమ్‌ కె కుమార్ దర్శకుడు.

గ్యాంగ్‌ లీడర్‌ తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’  సినిమాలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. సుధీర్‌ బాబు మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్‌, అదితిరావ్‌ హైదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top