నందమూరి షేర్ | nandamuri kalyan ram sher release date october 30 | Sakshi
Sakshi News home page

నందమూరి షేర్

Sep 20 2015 12:41 AM | Updated on Sep 3 2017 9:38 AM

నందమూరి షేర్

నందమూరి షేర్

‘పటాస్’ సినిమాతో మంచి విజయం అందుకున్న కల్యాణ్‌రామ్ ఇప్పుడు ‘షేర్’గా విజృంభించడానికి సిద్ధమవుతున్నారు. మల్లికార్జున్ దర్శకత్వంలో

‘పటాస్’ సినిమాతో మంచి విజయం అందుకున్న కల్యాణ్‌రామ్ ఇప్పుడు ‘షేర్’గా విజృంభించడానికి సిద్ధమవుతున్నారు. మల్లికార్జున్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్, సోనాల్ చౌహాన్ జంటగా కొమర వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదల కానుంది. ‘‘షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పాటలను అక్టోబర్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కల్యాణ్‌రామ్ పాత్రచిత్రణ సరికొత్తగా ఉంటుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సాగే  ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాత చెప్పారు. కల్యాణ్‌రామ్ నటన ఈ చిత్రానికి హైలైట్ అని దర్శకుడు చెప్పారు, ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: సర్వేశ్ మురారి, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement