భలే కాంబినేషన్! | Nandamuri Kalyan ram next movie titled as Danchave Menatha Kuthura | Sakshi
Sakshi News home page

భలే కాంబినేషన్!

Aug 17 2016 11:48 PM | Updated on Sep 4 2017 9:41 AM

భలే కాంబినేషన్!

భలే కాంబినేషన్!

ప్రతి సినిమాకీ ప్రయోగాలు చేసే కథానాయకుడు కల్యాణ్‌రామ్. వినోద భరిత చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట జి.నాగేశ్వరరెడ్డి.

 ప్రతి సినిమాకీ ప్రయోగాలు చేసే కథానాయకుడు కల్యాణ్‌రామ్. వినోద భరిత చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట జి.నాగేశ్వరరెడ్డి. భారీ చిత్రాలకు కేరాఫ్‌గా చెప్పుకునే నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్. మరి వీరి ముగ్గురి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుందంటే? నిజంగా క్రేజీ కాంబినేషనే అని చెప్పాలి. ఇటీవల ‘పటాస్’ విజయంతో మాంచి ఊపుమీదున్నారు కల్యాణ్ రామ్. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘ఇజం’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయనున్నారని సమాచారం.
 
 ఆ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాత నాగేశ్వరరెడ్డి, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ కాంబినేషన్‌లో కల్యాణ్‌రామ్ కొత్త మూవీ చేయనున్నారనే సమాచారం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే తమ్ముడు జూ.ఎన్టీఆర్‌కు ‘నాన్నకు ప్రేమతో’ వంటి హిట్ చిత్రం ఇచ్చారు ప్రసాద్. ఇప్పుడేమో అన్న కల్యాణ్‌రామ్‌తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం నాగేశ్వరరెడ్డి స్టయిల్లో వినోద భరితంగా ఉంటుందో... లేక కల్యాణ్ రామ్ స్టయిల్లో విలక్షణంగా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement