నట విశ్వరూపం

నట విశ్వరూపం - Sakshi


 లెజెండ్’ విడుదలైన 413 రోజులకు నందమూరి బాలకృష్ణ ‘లయన్’గా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. సత్యదేవా దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో రుద్రపాటి రమణారావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఇందులో బాలకృష్ణ సరసన త్రిష, రాధికా ఆప్టే నాయికలుగా చేశారు. బాలకృష్ణ - సంగీత దర్శకుడు మణిశర్మలది విజయవంతమైన కాంబినేషన్. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి మ్యూజికల్ హిట్స్ వీరి కలయికలో వచ్చాయి. ఆ జాబితాలోనే ఈ సినిమా కూడా చేరుతుందని సత్యదేవా నమ్మకంగా చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చాటి చెప్పే సినిమా ఇది. సంభాషణలు అదిరిపోయే స్థాయిలో ఉంటాయి. నందమూరి అభిమానులు కోరుకునే అన్ని వాణిజ్య అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ నెల 14 గురువారం ఉదయం 9 గంటల 36 నిమిషాలకు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top