చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్స్‌తో ఆడిపాడిన సోనాలి బింద్రే అప్పట్లో టాప్ హీరోయిన్‌గా కొనసాగారు. సొనాలి బింద్రే వివాహనాంతరం సినిమాలకు దూరమైయ్యారు. సినిమాల్లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు సొనాలి బింద్రే. మన్మథుడు, ఇంద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్, మురారి, ఖడ్గం లాంటి హిట్ సినిమాల్లో నటించారు.
తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ బుధవారం ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సోనాలి సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు సొనాలి బింద్రే ప్రకటించారు. దీంతో సొనాలి బింద్రే అభిమానులు షాక్‌కు గురయ్యారు. సొనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడటంపై నాగార్జున స్పందించారు. ‘ నువ్వు త్వరగా కోలుకోవాలని, నీ ఆత్మస్థైర్యానికి ఇంకా బలం చేకూరాలని ఆశిస్తున్నా’నంటూ ట్వీట్ చేశారు. వీరిద్దరు కలిసి మన్మథుడు సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
Wishing you a speedy recovery and all the strength to your great spirit dear @iamsonalibendre 💐 https://t.co/d0fcseSEGb
— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 5, 2018

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
