సర్‌ప్రైజ్‌ ఇవ్వకుండా ఉండలేవు కోడలా!

Nagarjuna Akkineni Comments On Samanthas U Turn Trailer - Sakshi

హైదరాబాద్‌ : టాలీవుడ్‌ ‘కింగ్‌’ నాగార్జున తన కోడలు, నటి సమంత లేటెస్ట్‌ మూవీ ట్రైలర్‌పై స్పందించారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యూ టర్న్‌’ ట్రైలర్‌ శుక్రవారం రిలీజ్‌ చేశారు. ఓ కేసు విషయంలో భాగంగా సమంత పోలీసు స్టేషన్‌కు వెళ్లడం, ఆ ప్రమాదాలకు సమంతే కారణం అంటూ పోలీసులు ప్రశ్నించడం వంటి సన్నివేశాలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. ఈ ట్రైలర్‌ చూసిన నాగ్‌.. ‘వావ్‌, సర్‌ప్రైజ్‌ ఇవ్వకుండా ఉండలేవు కోడలా.. మూవీ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌’ అని ట్వీట్‌ చేశారు. తనను ఎప్పుడూ ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు మామా అని డ్యాన్స్‌ చేస్తున్న ఎమోజీలతో స్యామ్‌ రీట్వీట్‌ చేశారు.

లవ్‌ యూ అని సమంత భర్త, నటుడు నాగ చైతన్య ట్వీట్‌ చేయగా.. ట్రైలర్‌ బాగుందని.. మూవీ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ అని రకుల్‌ప్రీత్‌, అఖిల్‌, రానా స్పందించారు. వీరందరికీ సమంత థ్యాంక్స్‌ చెప్పారు. కాగా కన్నడలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన పవన్‌ కుమార్‌ ఈ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సమంతతో పాటు భూమిక ఓ కీలకపాత్రలో నటిస్తుండగా మిగతా పాత్రల్లో ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌ కన్పించనున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

(ఆసక్తి పెంచుతోన్న సమంత ‘యూ టర్న్‌’ ట్రైలర్‌)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top