‘అల్లుడు’ వసూళ్లు అదరగొడుతున్నాడు

Naga Chaitanya Highest Opening Collections For Sailaja Reddy Alludu - Sakshi

నాగ చైతన్య మంచి జోష్‌లో ఉన్నాడని తెలుస్తోంది. ‘శైలజా రెడ్డి అల్లుడు’తో ఈ వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్లడంతో సంతోషంగా ఉన్నట్టున్నాడు. 

మారుతి స్టైల్లో తెరకెక్కిన ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ బాగానే వర్కౌట్‌ అయినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా తొలిరోజే పన్నెండు కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది. తన సినిమా కెరీర్‌లో హయ్యస్ట్‌ ఓపెనర్‌గా ఈ చిత్రం నిలిచింది. నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచేలా ఉంది ఈ చిత్రం.  ఈ మూవీలో రమ్యకృష్ణ, అను ఇమాన్యుయేల్‌, మురళీ శర్మ, నరేష్‌ కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ యువ హీరో తన తదుపరి ప్రాజెక్ట్‌ ‘సవ్యసాచి’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top