ఊహకందని మలుపులతో... | mysterious twists and turns ... | Sakshi
Sakshi News home page

ఊహకందని మలుపులతో...

Nov 15 2015 11:20 PM | Updated on Sep 3 2017 12:32 PM

ఊహకందని మలుపులతో...

ఊహకందని మలుపులతో...

శ్రీరామ్, కిశోర్, పాండి, కుట్టుమణి, సన ప్రధాన పాత్రల్లో ఎస్.డి. రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వజ్రం’.

శ్రీరామ్, కిశోర్, పాండి, కుట్టుమణి, సన ప్రధాన పాత్రల్లో ఎస్.డి. రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వజ్రం’. ఈ చిత్రాన్ని సాయిరంగా ఫిలింస్ పతాకంపై ‘ఓదార్పు యాత్ర’ పేరుతో కె. రంగారావు తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘
 రాజకీయ నేపథ్యంలో జరిగే థ్రిల్లర్ కథ ఇది.

కుటుంబమంతా కలసి చూసే సందేశాత్మక చిత్రం. తమిళంలో వంద రోజులాడింది. ‘గోలీ సోడా’ వంటి విజయవంతమైన చిత్రంలో నటించిన పలువురు నటీనటులు ఇందులో నటించారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. పాటలు-మాటలు: వెన్నెలకంటి-మలూరి వెంకట్.
 

Advertisement
 
Advertisement
Advertisement