ఇప్పుడు చాలా హాయిగా ఉంది! | my life is full happy says tamanna | Sakshi
Sakshi News home page

ఇప్పుడు చాలా హాయిగా ఉంది!

Oct 5 2015 11:28 PM | Updated on Sep 3 2017 10:29 AM

ఇప్పుడు చాలా హాయిగా ఉంది!

ఇప్పుడు చాలా హాయిగా ఉంది!

జీవితం చాలా అద్భుతమైనది. మనల్ని ఎటువైపు మళ్లిస్తుందో ఊహించలేం. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు..

‘‘జీవితం చాలా అద్భుతమైనది. మనల్ని ఎటువైపు మళ్లిస్తుందో ఊహించలేం. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు.. కానీ, రేపేం చేయాలో ఈరోజే ప్లాన్ చేసేసుకుంటాం. ఊహించినది జరగకపోతే అప్‌సెట్ అయిపోతాం. అదే జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఎలాంటి నిరాశా, నిస్పృహలు ఉండవు’’ అని తమన్నా అంటున్నారు. ఈ మిల్కీ బ్యూటీకి జీవితం గురించి నిర్దిష్టమైన అభిప్రాయం ఉందట. దాని గురించి తమన్నా చెబుతూ -‘‘ఒకప్పుడు చిన్న చిన్న కష్టాలకే పెద్దగా బాధపడిపోయేదాన్ని.
 
  అలాగే, చిన్ని చిన్ని సక్సెస్‌లకే పెద్దగా ఆనందపడిపోయేదాన్ని. కానీ, అలా జీవిస్తే ప్రమాదం అని తెలుసుకున్నాను. కష్టసుఃఖాలకు సమానంగా స్పందించడం అలవాటైతే జీవితం బాగుంటుందని అర్థం చేసుకున్నాను. అందుకే, జరగకూడనిది జరిగినప్పుడు.. జరగనున్నది మంచికే అనుకుంటాను. అందుకని అతిగా బాధపడిపోను. ఒకవేళ మంచి జరిగితే.. ఆ వెంటే చెడు ఉంటుందనుకుంటా. సో.. అతిగా ఆనందపడిపోను. ఇలా బతకడం మొదలుపెట్టాక చాలా హాయిగా ఉంటోంది. జీవితాన్ని అర్థం చేసుకుంటే ఆనందమే మినహా దుఃఖానికి తావు లేదు’’ అన్నారు. దీన్నిబట్టి తమన్నాకి జీవితం పట్ల మంచి అవగాహన ఉందని అర్థమవుతోంది కదూ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement