ఇక సినిమాలు ప్రదర్శించుకోవచ్చు | Sakshi
Sakshi News home page

ఇక సినిమాలు ప్రదర్శించుకోవచ్చు

Published Thu, Mar 8 2018 3:54 AM

Movies opening Friday, March 9 - Sakshi

‘‘ఈ బిజినెస్‌ విధానంలోనే స్టార్టింగ్‌ నుంచి లోపాలు ఉన్నాయి. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ అందరం చిన్న చిన్న తప్పులు చేశాం. ఈ చిన్న తప్పులే పెద్దవయ్యాయి. ఇనిషియల్‌ స్టేజెస్‌లో జరిగిన ఒప్పందాలు సరిగ్గా అమలు కాలేదు. ప్రాబ్లమ్‌ పెద్దది కావడం వల్లే థియేటర్స్‌ను క్లోజ్‌ చేయాలనే డెసిషన్‌ తీసుకోవాల్సి వచ్చింది. మాకెవ్వరికీ షూటింగ్స్‌ ఆపాలని, థియేటర్స్‌ను క్లోజ్‌ చేయాలని లేదు. మాకు ప్రతిరోజు ప్రేక్షకులను ఎలా థియేటర్స్‌కు రప్పించాలని, ఎక్కువ సినిమాల షూటింగ్‌ ఎలా చేయాలి? అని మాత్రమే ఉంటుంది’’ అన్నారు నిర్మాత సురేష్‌బాబు.

విజువల్‌ ప్రింటింగ్‌ ఫీజు విషయమై డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌కు, సౌత్‌ ఇండస్ట్రీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీకి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్చలు కొంతమేర సఫలం అయ్యాయి. ఈ నెల 9 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ప్రదర్శన కొనసాగనుంది. ఈ విషయమై ఫిల్మ్‌ చాంబర్‌లో బుధవారం రాత్రి జరిగిన పాత్రికేయుల సమావేశంలో సురేష్‌బాబు మాట్లాడుతూ– ‘‘వీలున్నవాళ్లు గురువారమే సినిమాలను ప్రదర్శించుకోవచ్చు.

7–10డేస్‌లో ఫైనల్‌ రేట్‌కార్డ్స్‌ని ఫైనలైజ్‌ చేస్తాం. క్యూబ్, యూఎఫ్‌ఓకి సెపరేట్‌ రేట్స్‌ ఉండేవి.ఇప్పుడు ఓ రేట్‌ కార్డ్‌ సెట్‌ చేశాం. ఇవన్నీ ఏప్రిల్‌ మొదటి వారం నుంచి అమలులోకి వస్తాయి. ఆల్‌ ఇండస్ట్రీ మెంబర్స్‌ ప్రపోజల్స్‌ను పరిశీలించాం. కొందరికి మరికొన్ని కోరికలు ఉన్నాయి. వాటిని కూడా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌కి పంపించాం. ప్రస్తుతం యూఎఫ్‌ఓ, క్యూబ్‌ డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌తో ప్రపోజల్స్‌ చేశాం. తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఒప్పందాల మేరకు సైన్‌ చేశాయి. మిగతా రాష్ట్రం వాళ్లు కూడా చర్చలు జరుపుతున్నారు. వాళ్ల పోరాటాలు కంటిన్యూ అవుతున్నాయి.

కర్ణాటక వాళ్లు 9 నుంచి సినిమాలు బంద్‌ చేస్తున్నాం అన్నారు. తమిళ వాళ్లు కంటెంట్‌ ఇవ్వటం ఆపేస్తాం అన్నారు. ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. మేం ఇప్పుడు చేసింది కరెక్ట్‌ అని అనుకుంటున్నాం. ఈ వారం రోజుల లాభనష్టాల బేరీజు పక్కన పెడితే అందరికీ ఒక అవగాహన వచ్చింది. ప్రతి ఒక్క ఎగ్జిబిటర్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌కు మళ్లీ ఆలోచించడానికి అవకాశం వచ్చింది.డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌వారితో చర్చలు జరిపిన తర్వాత వారు కొన్ని విషయాలు చెప్పారు. మేం అర్థం చేసుకున్నాం. మేం చెప్పిన విషయాలను వాళ్లు అర్థం చేసుకున్నారు. మా డిమాండ్స్‌ తీర్చాలంటే కంపెనీలు మూసుకోవాలని వాళ్లు చెబుతున్నారు. ఇంతవరకు చేయగలిగాం. వేరే ప్లాన్స్‌ ఉన్నాయి. ఇంకా చేయగలం. ఫైనల్‌గా అందరికీ మంచి జరిగేలా చూస్తాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement