మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఫిక్స్ | Mohan Krishna Indraganti latest project with two actors | Sakshi
Sakshi News home page

మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఫిక్స్

Mar 12 2017 9:03 PM | Updated on Aug 11 2019 12:30 PM

మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఫిక్స్ - Sakshi

మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఫిక్స్

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఖరారైంది.

హైదరాబాద్: మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఖరారైంది. ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ హీరోలుగా  నటిస్తున్న ఈ మూవీకి 'అమీ తుమీ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ఆదివారం సాయంత్రం ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన వేడుకలో చిత్ర బృందం సమక్షంలో విడుదల చేసారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నరసింహారావు మాట్లాడుతూ.. 'ఈనెల 23వ తేదీతో టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న 'అమీ తుమీ' తెలుగు ప్రేక్షకులను మనస్ఫూర్తిగా నవ్వుకొనేలా చేస్తుంది. ఈషా, అదితి మ్యాకల్ పాత్రలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. పాటల చిత్రీకరణను త్వరలోనే పూర్తి చేసి ఆడియోతో పాటు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం. అందరూ తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది' అని చెప్పారు.

అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ల భార్గవ్, తడివేలు తదితరులు నటించారు. ఈ చిత్రానికి మేకప్ చీఫ్‌గా సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్‌గా మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్‌గా డి.యోగానంద్, కో-డైరెక్టర్ గా కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్‌గా మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రాఫర్‌గా పి.జి.విందా పనిచేశారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్, ప్రొడ్యూసర్ కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement