సుదీర్ఘ అధర చుంబనం! | Manoj Nandam and Priyanka Pallavi Lip lock in Oka Criminal Prema Katha | Sakshi
Sakshi News home page

సుదీర్ఘ అధర చుంబనం!

Jun 24 2014 1:14 AM | Updated on Sep 2 2017 9:16 AM

సుదీర్ఘ అధర చుంబనం!

సుదీర్ఘ అధర చుంబనం!

ప్రస్తుతం లిప్ లాక్‌ల సీజన్ నడుస్తోంది. యువతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం చాలామంది లిప్ లాక్‌ల సన్నివేశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. సొంతవూరు, గంగపుత్రులు తదితర

ప్రస్తుతం లిప్ లాక్‌ల సీజన్ నడుస్తోంది. యువతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం చాలామంది లిప్ లాక్‌ల సన్నివేశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. సొంతవూరు, గంగపుత్రులు తదితర చిత్రాలతో ఎన్నో పురస్కారాలు గెలుచుకున్న సునీల్‌కుమార్ రెడ్డి తాజాగా తను తీసిన ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’లో కథానుసారం ఓ లిప్ లాక్ సీన్ పొందుపరిచారు. ఓ బలమైన కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో సన్నివేశాలన్నీ దాదాపు బలంగానే ఉన్నాయట. వాటిలో ఈ పెదవి ముద్దు సన్నివేశం ఒకటి. హీరోహీరోయిన్లు మనోజ్, ప్రియాంకా పల్లవి పాల్గొనగా ఇటీవల ఈ సన్నివేశం తీశారు.

ఇలాంటి సీన్స్‌లో నటించడం అంత సులువైన విషయం కాదు. నటీనటులు మానసికంగా సమాయత్తం కావాలి. మనోజ్, ప్రియాంక అలానే అయ్యారు. కానీ, సునీల్‌కుమార్ రెడ్డి ‘స్టార్ట్ కెమెరా..’ అనగానే అదరాలు వణకడం మొదలుపెట్టాయి. ఇక, చుంబనం సంగతి దేవుడెరుగు. మొత్తానికి టేక్స్ మీద టేక్స్ తీసుకున్నారట. ఫలితంగా ఈ ఒక్క సన్నివేశం చిత్రీకరణకు పట్టిన సమయం ఎనిమిది గంటలు. అది ఓకే.. కానీ, చిత్రీకరణకు అయిన నిడివి ఆ సినిమా మొత్తం నిడివి అంత అట. పెదవి ముద్దు సన్నివేశం నిడివి 90 సెకన్లకు పైగా ఉంటుందట. ఇప్పటివరకు తెలుగు తెరపై ఇంత నిడివి గల చుంబనం రాలేదని నిర్మాత రవీంద్రబాబు పేర్కొన్నారు. ఈ చిత్రం త్వరలోనే రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement