నలుగురిలో నవాబ్‌ ఎవరు?

Mani Ratnam's multi-starrer project titled Chekka Chivantha Vaanam - Sakshi

నవాబ్‌.. అనుకున్నంత ఈజీ కాదు అవ్వడం. ఆరాటపడేవారు, పోరాడేవారు, లాక్కోవాలనుకునేవారు, కష్టపడి దక్కించుకునేవారు... అందరూ లిస్ట్‌లో ఉంటారు. ప్రస్తుతం ఆ లిస్ట్‌ డైరెక్టర్‌ మణిరత్నం దగ్గర ఉంది. సినిమాలో నవాబ్‌ ఎవరన్నది తెరపై చూడాల్సిందే అంటున్నారాయన. అరవింద్‌ స్వామి, విజయ్‌ సేతుపతి, శింబు, అరుణ్‌ విజయ్, జ్యోతిక, అదితీరావ్‌ హైదరి, ఐశ్వర్య రాజేష్, ప్రకాశ్‌రాజ్‌ ముఖ్యతారలుగా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు.

తమిళ్‌లో ‘చెక్కవంద వానమ్‌’ (ఎర్రని ఆకాశం తెలుగులో)అని, తెలుగులో ‘నవాబ్‌’ అనే టైటిల్స్‌ను ఖరారు చేశారు. శుక్రవారం టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. మరి.. ఎవరు నవాబ్‌? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈ సినిమాలో ఓ ఇద్దరు హీరోలు అన్నదమ్ముల పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో న్యూ లుక్‌లో కనిపించడానికి హీరో శింబు ఆల్రెడీ వర్కౌట్స్‌ స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. మదరాస్‌ టాకీస్‌ పతాకం, లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించనున్న ఈ సినిమాకు సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top