వైరల్‌: హృతిక్‌ రోషన్‌ను అచ్చం దించేశాడు

Man Dancing With Hrithik Roshan You Are My Soniya Song In Tiktok - Sakshi

ప్రస్తుతం చాలామంది టిక్‌టాక్‌ యాప్‌ ద్వారా తమలో ఉన్న టాలెంట్‌ను బయటపెడుతున్న విషయం తెలిసిందే. కొంత మంది టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో ఫేమస్ అవుతున్నారు. మరి కొంతమంది తమ అభిమాన హీరో, హీరోయిన్ల డైలాగ్స్‌, డాన్స్‌ను అచ్చంవారిలాగే చేస్తూ అబ్బురపరుస్తున్నారు. అయితే తాజాగా అర్మాన్ రాథోడ్ అనే వ్యక్తి చేసిన టిక్‌టాక్‌ వీడియో  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ హీరో హృతిక్ రోష‌న్ నటించిన ‘కబీ ఖుషి కబీ ఘామ్’ చిత్రంలోని ‘యు ఆర్ మై సోనియా’అనే పాటకు అర్మాన్‌ రాథోడ్‌  సూపర్‌ కూల్‌ స్టెప్స్‌ వేస్తూ టిక్‌ టాక్‌లో డాన్స్‌ చేశారు. ఈ వీడియోలో అతను హృతిక్‌ స్టైల్‌కి ఏమాత్రం తగ్గకుండా  చాలా అద్భుతంగా డాన్స్‌  చేశారు. ఈ టిక్‌ టాక్‌ వీడియో రోజీ అనే ట్విటర్‌ యూజర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. (ఎన్టీఆర్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌..)

‘ట్విటర్‌ అర్మాన్‌ను ఫేమస్‌ చేస్తుంది’ అని కామెంట్‌ జతచేశారు. అర్మాన్‌ చేసి డాన్స్‌కు మెస్మరైజ్ అయన నెటిజన్ల సోషల్‌ మీడియాలో ఆతనిపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. అర్మాన్‌కు సంబంధించిన మరో సూపర్‌ డాన్స్‌ టిక్‌టాక్‌ వీడియోను రోజీ పోస్ట్‌ చేసి ‘అతనికి అసాధారణమైన డాన్స్‌ టాలెంట్‌ ఉంది’ అని మరో కామెంట్‌ను ఆమె జతచేశారు. ‘అతని డాన్స్‌ కదలికలు చాలా అద్భుతం’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘వాట్‌ ఏ ఖాతర్నాక్‌ డాన్సర్‌​‍’ అని మరోక నెటిజన్‌ కామెంట్‌ పెట్టారు. ‘ఇదేంటిరా బాబు అతను హృతిరోషన్‌ డాన్స్‌ను అచ్చం దించేశాడు’ అని మరోక నెటిజన్‌ కామెంట్‌ చేశారు.‌ ఇవే కాకుండా హృతి రోషన్‌కి సంబంధించిన పలు పాటలకు అర్మాన్‌ డాన్స్‌ చేస్తూ టిక్‌టాక్‌ వీడియోలు‌ చేశారు. అతను చేసిన అన్ని డాన్స్‌ వీడియోలు సోషల్ ‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ డాన్స్‌ వీడియోలను కొందరు నెటిజన్ల హీరో హృతిక్‌రోషన్‌, వరుణ్‌ ధావన్‌లకు ట్యాగ్‌ చేశారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top