మహేష్, మురుగదాస్.. అంతా ఓకే | Sakshi
Sakshi News home page

మహేష్, మురుగదాస్.. అంతా ఓకే

Published Wed, Dec 2 2015 9:13 AM

మహేష్, మురుగదాస్.. అంతా ఓకే

ఇన్నాళ్లు టాలీవుడ్ సర్కిల్స్లో వినిపించిన, మహేష్ బాబు తదుపరి సినిమా ఓకే అయ్యింది.  సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న మహేష్, దాని తరువాత మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను మొదలుపెట్టనున్నాడు.

మహేష్, మురుగదాస్ల కాంభినేషన్లో తెరకెక్కనున్న సినిమాను వచ్చే ఏడాది ప్రారంభిస్తున్నట్టు, ఆ సినిమా సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ ప్రకటించాడు. ఇన్నాళ్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న మహేష్ అభిమానుల కోసం తన ట్విట్టర్ పేజ్పై 'వచ్చే ఏడాది ప్రారంభం కానున్న మహేష్ బాబు, మురుగదాస్ల సినిమా కోసం ఎదురుచూస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు.

మురుగదాస్ కూడా ప్రస్తుతం సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అకీరా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత మహేష్తో తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నాడు. ఈ సినిమాను 120 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

 

Advertisement
 
Advertisement
 
Advertisement