మ్యూజికల్‌ రైడ్‌

Madhavan, Anushka Shetty to begin shooting for 'Silence' - Sakshi

ఈ ఏడాది అరడజను తెలుగు సినిమాలకు సంగీతం అందించి మంచి ఊపు మీద ఉన్నారు మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్‌. అటు మాలీవుడ్‌లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తున్న గోపీసుందర్‌ తాజాగా మరో తెలుగు సినిమాకు స్వరాలు సమకూర్చడానికి సిద్ధం అయ్యారు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్‌ హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో అనుష్కా, మాధవన్‌ ప్రధాన పాత్రలుగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘సైలెన్స్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందించనున్నారు. కోన  ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది యూఎస్‌లో ప్రారంభం కానుంది. ‘‘తెలుగులో ఇప్పటికే గోపీ సుందర్‌ మంచి సంగీతం అందించారు. ఆయన మా సినిమాకు మ్యూజిక్‌ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు హ్యాపీ. మంచి మ్యూజికల్‌ రైడ్‌గా ఉంటుందీ చిత్రం’’ అన్నారు కోన వెంకట్‌. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top