
అమ్మాయి ప్రేమ కోసం
ఆ అమ్మాయి చూడచక్కగా ఉంటుంది. ఓ డాక్టర్, ఒక ప్రొఫెసర్, ఓ టైలర్, ఒక స్టూడెంట్... ఆ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడానికి పోటీ పడతారు.
ఆ అమ్మాయి చూడచక్కగా ఉంటుంది. ఓ డాక్టర్, ఒక ప్రొఫెసర్, ఓ టైలర్, ఒక స్టూడెంట్... ఆ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడానికి పోటీ పడతారు. ఆ అమ్మాయి ఎవర్ని ప్రేమిస్తుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘కుమారి 18+’. వై. సుధాకర్ సమర్పణలో సెన్సేషనల్ హిట్ మూవీస్, ఫిల్మ్ విల్లా స్టూడియోస్ నిర్మాణంలో శ్రీ సత్య దర్శకత్వంలో రూపొందింది.
మాల్యీ మల్హోత్రా, యోధ, గోపికృష్ణ, సాయికిరణ్, ఆదిత్యారాం ముఖ్య తారలు. మోషన్ పోస్టర్‌ను నిర్మాతలు శాఖమూరి మల్లిఖార్జునరావు, రాజ్ కందుకూరి విడుదల చేశారు. ‘‘ఈ నెలలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అని దర్శకుడు అన్నారు. ఇందులో డాక్టర్‌గా చేశానని ఆదిత్యారామ్, టైలర్ పాత్ర చేశానని సాయికిరణ్ తెలిపారు.