ఎన్టీఆర్‌ బయోపిక్‌ దర్శకుడు దొరికాడు: బాలకృష్ణ

Krish Will Direct NTR Biopic Says Nandamuri Balakrishna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదిలోనే ఆటంకాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌కు సంబంధించి నటుడు, నిర్మాత నందమూరి బాలకృష్ణ కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు క్రిష్‌  జాగర్లమూడి దర్శకత్వం వహిస్తారని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మికి ఎవరో ఇప్పుడు తెలిసింది. నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది...’’ అంటూ బాలయ్య గాత్రంతో ఓ వీడియోను విడుదలచేశారు.

బాలకృష్ణ హీరోగా, నిర్మాతగానూ వ్యవహరిస్తోన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌.. రెండు నెలల కిందట అట్టహాసంగా ప్రారంభం కావడం, దర్శకుడు తేజా అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో బాలకృష్ణే దర్వకత్వ బాధ్యతలు చేపట్టాలని డిసైడ్‌ అయ్యారు. అనేక చర్చోపచర్చల తర్వాత చివరికి క్రిష్‌ను దర్శకుడిగా ఖరారుచేశారు. క్రిష-బాలకృష్ణ కాబినేషన్‌లో వచ్చిన చారిత్రక చిత్రం శాతకర్ణి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

నమ్మకాన్ని నిలబెడతా: క్రిష్‌
బాలయ్య ప్రకటన అనంతరం దర్శకుడు క్రిష్‌ స్పందిస్తూ.. ‘‘నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకప్పగించిన బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ఇది కేవలం ఒక సినిమా బాధ్యత కాదు. ప్రపంచంలోని తెలుగువాళ్లందరి అభిమానానికి, ఆత్మాభిమానానికి అద్దంపట్టే బాధ్యత. మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top