అమ్మడూ...ఇక కుమ్ముడే! | Khaidi No.150 Audio Launch Cancelled | Sakshi
Sakshi News home page

అమ్మడూ...ఇక కుమ్ముడే!

Dec 17 2016 11:12 PM | Updated on Sep 4 2017 10:58 PM

అమ్మడూ...ఇక కుమ్ముడే!

అమ్మడూ...ఇక కుమ్ముడే!

చిరంజీవి స్టెప్పులు, డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?! స్టార్‌ నుంచి మెగాస్టార్‌ కావడంలో ఆయన యాక్టింగ్‌తో పాటు డ్యాన్సులకు క్రెడిట్‌ దక్కుతుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.

చిరంజీవి స్టెప్పులు, డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?! స్టార్‌ నుంచి మెగాస్టార్‌ కావడంలో ఆయన యాక్టింగ్‌తో పాటు డ్యాన్సులకు క్రెడిట్‌ దక్కుతుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. మరి, రీ–ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్‌ 150’లోనూ మునుపటిలా స్టెప్పులు వేస్తారా అనడిగితే... సందేహాలు అవసరం లేదంటున్నారు దర్శకుడు వీవీ వినాయక్‌.

శాంపిల్‌గా ఈరోజు సాయంత్రం ‘అమ్మడూ.. లెట్స్‌ డు కుమ్ముడు’ అనే సాంగ్‌ టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన ‘సరైనోడు’, ‘ధృవ’ సినిమాల పాటలను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేసి, తర్వాత ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ చేశారు.

ఇప్పుడీ ‘ఖైదీ నంబర్‌ 150’కి కూడా అదే సెంటిమెంట్‌ ఫాలో అవుతూ.. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలను ఈ నెల 25న నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. జనవరి మొదటి వారంలో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ చేయనున్నారు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను చిరంజీవి సతీమణి సురేఖ సమర్పణలో ఆయన తనయుడు రామ్‌చరణ్‌ నిర్మించారు. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement