రజనీ కూతురు?

Keerthy Suresh is Rajinikanths daughter in new film - Sakshi

రజనీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, కీర్తీ సురేష్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారని తెలిసింది. శనివారం ఖుష్బూ ఈ సినిమా సెట్‌లో జాయినయ్యారు. దాదాపు 28ఏళ్ల తర్వాత రజనీ–ఖుష్బూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ సినిమాలో రజనీ కూతురి పాత్రలో కీర్తీ సురేష్‌ నటిస్తున్నారని, ఆల్రెడీ ఆమె షూటింగ్‌లో పాల్గొంటున్నారన్నది తాజా సమాచారం. అలాగే ఈ సినిమాలో రజనీ రెండు పాత్రలు చేస్తున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ప్రకాష్‌రాజ్, సూరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top