ప్రేమికుల దినోత్సవానికి రెడీ

karthi dev movie updates - Sakshi

కార్తీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవ్‌’. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో ప్రిన్స్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. లక్ష్మణ్‌ కుమార్, ‘ఠాగూర్‌’ మధు తెలుగు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్‌ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి  రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు . ఇప్పటికే విడుదలైన ‘దేవ్‌’ ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన వచ్చిం ది. షూటింగ్‌ పూర్తి చేసుకొన్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.

‘ఖాకీ’ చిత్రం తర్వాత కార్తీ, రకుల్‌ మరోసారి జత కట్టారు. ప్రేమికుల దినోవత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ¯ð ల 14న చిత్రం ఆడియో వేడుక జరగనుంది. ‘‘ఇప్పటికే విడుదలైన తమిళ ఆడియోకు మంచి స్పందన లభించింది. తెలుగు పాటలకు కూడా మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హారీశ్‌ జయరాజ్, కెమెరా: వేల్రాజ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top