కరీనాపై కంగనా ప్రశంసల జల్లు

Kangana Ranaut Comments On Kareena Kapoor Khan - Sakshi

ముంబై : మణికర్ణిక వివాదం, బంధుప్రీతిపై విరుచుకుపడుతూ తరచుగా వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ మరోసారి తన వ్యాఖ్యలతో హాట్‌ టాపిక్‌గా మారారు. అయితే ఈసారి నెగటివ్‌ కామెంట్స్‌తో కాకుండా సాటి హీరోయిన్‌పై ప్రశంసలు కురిపించి ఆశ్చర్యపరిచారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘ కరీనా అంటే నాకు చాలా ఇష్టం. తనెంతో మర్యాదగా వ్యవహరిస్తారు. తన లాంటి నటిని నేను ఇంతవరకు చూడలేదు. భార్యగా, తల్లిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్న పరిపూర్ణ మహిళ ఆమె. పాజిటివ్‌ మెసేజెస్‌ పంపుతూ నన్నెప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందరికీ ఆదర్శమైన మహిళ తను’ అంటూ కంగనా... కరీనా కపూర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.(ఆమెకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధం : అలియా భట్‌)

ఇక తన బయోపిక్‌ను తానే తీస్తానంటూ కంగనా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన కరీనా.. ‘ కంగనా బయోపిక్‌ చూడాలని ఆత్రుతగా ఉంది. గొప్ప నటీమణుల్లో తను కూడా ఒకరు. తన నటన నాకెంతగానో నచ్చుతుంది. అంతేకాదు కంగనా చాలా తెలివైనది కూడా అని కంగనాపై అభిమానాన్ని చాటుకున్నారు. కాగా ఇటీవల విడుదలైన తన మణికర్ణిక సినిమాకు బాలీవుడ్‌ సపోర్టు చేయడం లేదంటూ కంగనా చిందులు తొక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌, హీరోయిన్‌ అలియా భట్‌తో పాటు ఆమిర్‌ ఖాన్‌ల తీరును ఆమె విమర్శించారు.(అలియా భట్‌పై కంగనా రనౌత్‌ విమర్శలు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top