కాజల్‌ క్వీన్‌ అయిన వేళ

Kajal Hindi movie Queen Remake was launched in Chennai on Sunday morning. - Sakshi

తమిళసినిమా: నటి కాజల్‌అగర్వాల్‌ వెండితెర క్వీన్‌ అయ్యిందీవేళ.కాజల్‌ హిందీ చిత్రం క్వీన్‌ రీమేక్‌లో నటించనున్నారన్న ప్రచారం జరగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆదివారం ఉదయం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. హిందీలో కంగనారనౌత్‌ నటించిన క్వీన్‌ ఆమెకు జాతీయ అవార్డును అందించింది. తాజాగా  ఈ చిత్రం దక్షిణాది భాషల్లో రీమేక్‌ కానుంది. ఈ చిత్రానికి తమిళంలో ప్యారిస్‌ ప్యారిస్‌ టైటిల్‌ను నిర్ణయించారు. మీడియంటీ పతాకంపై మనుకుమార్, లైంగర్‌ మనోజ్‌కేశవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కన్నడ నటుడు రమేశ్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇంతకు ముందు కమలహాసన్‌ హీరోగా ఉత్తమవిలన్‌ చిత్రాన్ని తెరకెక్కించింది ఈయనేనన్నది గమనార్హం. ప్రముఖ రచయిత్రి తమిళచ్చి తంగపాండియన్‌ ఈ చిత్రానికి మాటలు, పాటలు రాయడం మరో విశేషం. శశి అనే నవ నటుడు కథానాయకుడిగా నటించనున్నారు. చిత్ర షూటింగ్‌ అక్టోబర్‌ 4వ తేదీ నుంచి మొదలు కానుందని నిర్మాతలు వెల్లడించారు. క్వీన్‌ చిత్రాన్ని తాను చూశానని, అందులో కంగనారనౌత్‌ చాలా బాగా నటించారని కాజల్‌ అన్నారు.

అలాంటి మంచి పాత్రల్లో నటించే అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.  హిందీలో సంగీత బాణీలు అందించిన అమిత్‌ త్రివేదినే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కన్నడ వెర్షన్‌కు రమేశ్‌ అరవింద్‌నే దర్శకత్వం వహిస్తున్నారు. అందులో హీరోయిన్‌గా పార్వతి నటిస్తున్నారు. ఇక తెలుగులో నటించే హీరోయిన్‌ ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం గురించి త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top