టాలీవుడ్‌ చందమామ బర్త్‌డే కానుకగా..

Kajal Aggrawal Birthday Gift As Paris Paris Making Video - Sakshi

హైదరాబాద్‌: టాలీవుడ్‌ చందమామ, నటి కాజల్‌ అగర్వాల్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ మేకింగ్‌ వీడియోను మూవీ యూనిట్‌ విడుదల చేసింది. జూన్‌ 19న పుట్టినరోజు జరుపుకుంటున్న కాజల్‌కు సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్‌ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్లారుకు వనక్కం అంటూ కాజల్‌ నమస్కారం పెట్టారు. కాజల్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’.. సీనియర్‌ నటుడు రమేశ్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హిందీ ‘క్వీన్‌’కు తమిళ రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. 

ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కాజల్‌ బర్త్‌డే కానుకగా మూవీ మేకింగ్‌ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. హిందీలో కంగనా రనౌత్‌ నటనకు విమర్శల ప్రశంసలు అందుకున్న ‘క్వీన్‌’ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్యారిస్‌ ప్యారిస్‌ తప్పక చూడాలంటూ ప్రేక్షకులను నటి కాజల్‌ కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top