మైసూర్‌లో ప్యారిస్‌ ప్యారిస్‌!

Kajal Aggarwal about queen remake paris paris - Sakshi

‘ప్యారిస్‌ ప్యారిస్‌’ అంటూ మైసూర్‌ వెళ్లారట హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. అయ్యో.. పాపం ఆమె అలా ఎలా పొరపాటు పడ్డారు? ఇప్పుడెలా అని ఫ్యాన్స్‌ కంగారు పడిపోకండి. ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ అనేది సినిమా టైటిల్‌. ప్లేస్‌ కాదండీ బాబు. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో కాజల్‌ లీడ్‌ రోల్‌ చేస్తోన్న చిత్రం ‘ప్యారిస్‌ ప్యారిస్‌’. హిందీ హిట్‌ ‘క్వీన్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను చిత్రబృందం మైసూర్‌లో ప్లాన్‌ చేసింది. ఈ షూటింగ్‌లో కాజల్‌ పాల్గొంటున్నారట. మూడు రోజుల క్రితం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా హైదరాబాద్‌ షెడ్యూల్‌లో కాజల్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top