పెళ్లి గురించి క్లారిటీ ఇస్తా: కాజల్‌ | Kajal Agarwal Reveals About Her Marriage | Sakshi
Sakshi News home page

వాటిని నమ్మకండి: కాజల్‌

Dec 13 2019 1:20 PM | Updated on Dec 13 2019 6:10 PM

Kajal Agarwal Reveals About Her Marriage - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్‌ నగరంలో సందడి చేశారు. విజయవాడలో శుక్రవారం ప్రముఖ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెళ్లి చీరలంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇక గత కొద్దిరోజులుగా తన పెళ్లిపై వస్తున్న వదంతులపై నోరు విప్పారు. వాటిని నమ్మవద్దని కోరారు. పెళ్లి గురించి తానే ఓ క్లారిటీ ఇస్తానన్నారు. ప్రస్తుతం ఇతర భాషల్లోని పలు సినిమాల్లో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. హీరో కమల్‌ హాసన్‌తో కలిసి బహుభాషా చిత్రాల్లో నటిస్తున్నాని పేర్కొన్నారు. తెలుగులోనూ కథలు వింటున్నానని.. నచ్చితే వెంటనే సైన్‌ చేస్తానని చెప్పుకొచ్చారు. కాగా కాజల్‌ పెళ్లి పీటలెక్కనుందన్న వార్తలు ఫిల్మీదునియాలో వీర విహారం చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: పెళ్లి కళ వచ్చేసిందా భామా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement