Kajal Aggarwal Marriage News: పెళ్లి కళ వచ్చేసిందా భామా? - Sakshi
Sakshi News home page

పెళ్లి కళ వచ్చేసిందా భామా?

Dec 11 2019 8:08 AM | Updated on Dec 12 2019 11:22 AM

Kajal Aggarwal Beach Photos Viral in Social Media - Sakshi

సినిమా: పెళ్లి కళ వచ్చేసిందా భామా? నటి కాజల్‌ అగర్వాల్‌ గురించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ప్రశ్న ఇదే.  కాజల్‌ దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా వెలుగుతున్న నటి ఈ ఉత్తరాది బ్యూటీ. అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి అనే కంటే టాలీవుడ్‌లో ఒక్క అవకాశం కూడా లేదు. ఇక కోలీవుడ్‌లో శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం ఇండియన్‌–2 చేతిలో ఉంది. ఈ చిత్రాన్ని కూడా పూర్తి చేసి కాజల్‌ సంసార జీవితంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి  కాజల్‌అగర్వాల్‌కు చాలాకాలం నుంచే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయాన్ని తనే ఆ మధ్య స్వయంగా చెప్పింది. ఇంకా చెప్పాలంటే కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌కు పెళ్లి అయ్యి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే అప్పట్లో కెరీర్‌ హైప్‌లో ఉండడంతో కాజల్‌అగర్వాల్‌ పెళ్లి జోలికి వెళ్లలేదు.

ఆ తరువాత తనకు ఎలాంటి భర్త కావాలన్న విషయంలో చాలా పెద్ద పట్టికనే వెలిబుచ్చింది. అలాంటిది ఈ అమ్మడు ఇటీవల ప్రేమలో పడినట్లు ప్రచారం జోరుగా సాగింది. ఇక పారిశ్రామికవేత్తను డీప్‌గా లవ్‌ చేస్తున్నట్లు ప్రచారం హోరెత్తింది. కాజల్‌కు వరుడు దొరికాడు అనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. అప్పుడు అలాంటి వార్తలను కొట్టి పడేసిన కాజల్‌  ఇటీవల తన కుటుంబసభ్యులతో కలిసి అజ్మీర్‌ దర్గాకు వెళ్లి మొక్కులు తీర్చుకుంది. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. కాగా తాజాగా ఈ జాణ ఒక ఫొటోను తన ఇన్‌స్ట్ర్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. అది ఇప్పుడు పలు రకాల ఊహలకు తావిస్తోంది. అదేంటంటే కాజల్‌ సముద్ర తీరంలో సంధ్యాసమయంలో రెండు చేతులు పైకి ఎత్తి నిలబడినట్లు ఉంది. అయితే ఆమె రెండు చేతుల వేళ్లను ఆర్టిన్‌ ఆకారాన్ని చూపించేలా పెట్టింది. దీంతో తాను ప్రేమలో పడ్డట్టు సింబాలిక్‌గా కాజల్‌ చెప్పిందంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆమె అభిమానులు పెళ్లి కళ వచ్చేసిందా కాజల్‌? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ బ్యూటీకి ఇండియన్‌ –2నే చివరి చిత్రం అనే ప్రచారం జోరందుకుంది. మరి ఇలాంటి ప్రచారానికి కాజల్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

#Decembervibes 💕

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement