క్వీన్‌ అవడానికి నేను రెడీ! | Kajal Agarwal Ready to Queen role | Sakshi
Sakshi News home page

క్వీన్‌ అవడానికి నేను రెడీ!

Jun 25 2017 3:30 AM | Updated on Oct 30 2018 5:58 PM

క్వీన్‌ అవడానికి నేను రెడీ! - Sakshi

క్వీన్‌ అవడానికి నేను రెడీ!

క్వీన్‌గా మారడానికి ఏ భాషలోనైనా తాను రెడీ అంటోంది నటి కాజల్‌అగర్వాల్‌. 2014లో హిందీలో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్‌.

క్వీన్‌గా మారడానికి ఏ భాషలోనైనా తాను రెడీ అంటోంది నటి కాజల్‌అగర్వాల్‌. 2014లో హిందీలో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్‌. ఈ చిత్ర దక్షిణాది రీమేక్‌ హక్కులు సీనియర్‌ నటుడు, నిర్మాత త్యాగరాజన్‌ పొందారన్న విషయం తెలిసిందే. కాగా హిందీలో కంగనారనౌత్‌ నాయకిగా నటించిన పాత్రలో  నటించడానికి ఇక్కడ చాలామంది అగ్రనాయికలు ఆసక్తి చూపారు. అలాగే పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి కూడా. వారిలో మిల్కీబ్యూటీ తమన్నా పేరు ఖరారైనట్లు వార్తలు వెలువడ్డయి. కాగా ఈ చిత్ర కన్నడ రీమేక్‌ చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైనట్లు ప్రచారం జరిగింది.

అదే విధంగా చిత్ర రీమేక్‌ హక్కుల విషయంలో వివాదం తెరపైకి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో తాజాగా క్వీన్‌ అయ్యే అవకాశం కాజల్‌ అగర్వాల్‌ తలుపు తట్టిందట. ఈ విషయాన్ని ఇటీవల ఆ అమ్మడే ఒక భేటీలో తెలిపింది. ఆ కథేంటో చూద్దాం. హిందీ చిత్రం క్వీన్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆ చిత్ర రీమేక్‌లో నాయకి పాత్రను పోషించాలని కోరుకుంటున్నాను. లక్కీగా ఆ చిత్ర నిర్మాతలు ఆ పాత్రలో నటించమని నన్ను అడిగారు. నేనూ అందుకు సమ్మతించాను. అయితే ఇంకా ఒప్పందం కాలేదు.

చర్చల్లోనే ఉంది. అయితే క్వీన్‌ రీమేక్‌లో నటించడానికి చాలా మంది హీరోయిన్లు సిద్ధంగా ఉండగా ఆ పాత్ర నన్ను వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్ర రీమేక్‌లో నేను ఏ భాషలో నటించడానికైనా రెడీ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అజిత్‌తో రొమాన్స్‌ చేస్తున్న వివేగం, విజయ్‌తో డ్యూయెట్లు పాడుతున్న మెర్‌సల్‌ చిత్రాలు దాదాపు పూర్తి కావొచ్చాయి. తెలుగులో రానాతో స్టెప్స్‌ వేస్తున్న నేనేరాజా నేనేమంత్రి చిత్ర షూటింగ్‌ చివరి ద«శకు చేరుకుంది. సో కాజల్‌ కిప్పుడు అర్జెంట్‌గా ఒక కొత్త చిత్రం కావాలి. అందుకే క్వీన్‌ కోసం ఈ ఫీట్లు అని అనుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement