ఖైదీ బాగానే కలిసొచ్చింది..! | Kajal Agarwal is back in demand in Tollywood | Sakshi
Sakshi News home page

ఖైదీ బాగానే కలిసొచ్చింది..!

Mar 14 2017 12:12 PM | Updated on Aug 11 2019 12:52 PM

ఖైదీ బాగానే కలిసొచ్చింది..! - Sakshi

ఖైదీ బాగానే కలిసొచ్చింది..!

వరుస ఫ్లాప్లతో కెరీర్ ముగిసిపోయిందనుకున్న దశలో మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది కాజల్.

వరుస ఫ్లాప్లతో కెరీర్ ముగిసిపోయిందనుకున్న దశలో మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది కాజల్. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలతో వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటి కెరీర్,  వరుస ఫ్లాప్లతో కష్టాల్లో పడింది. ఇక కెరీర్ ముగిసిపోయనట్టే అనుకుంటున్న సమయంలో చిరంజీవి సరసన నటించే ఛాన్స్  కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మెగాస్టార్కు జోడిగా నటించిన ఖైదీ నంబర్ 150 ఘన విజయం సాధించటంతో కాజల్ మళ్లీ బిజీ అవుతోంది.

ఇప్పటికే తేజ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు.. నేనే మంత్రి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది కాజల్. ఈ సినిమాతో పాటు మరో మూడు తమిళ సినిమాలకూ కమిట్ అయ్యింది. ఒకప్పుడు ఫ్లాప్ హీరోయిన్గా అవకాశాల కోసం ఎదురుచూసిన కాజల్, ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా హీరోయిన్ అయ్యింది. మరోసారి కాజల్ లక్కీ గర్ల్గా మారిపోవటంతో తెలుగు నిర్మాత కూడా కాజల్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement