టెంపర్ చూపిస్తారట! | Jr NTR Puri Jagannath Film Title Temper | Sakshi
Sakshi News home page

టెంపర్ చూపిస్తారట!

Jul 6 2014 11:10 PM | Updated on Mar 22 2019 1:53 PM

టెంపర్ చూపిస్తారట! - Sakshi

టెంపర్ చూపిస్తారట!

పూరి జగన్నాథ్ సినిమా అంటే.. టైటిల్ నుంచే చర్చ మొదలు. హీరో స్వభావాన్ని బట్టి ఆయన పెట్టే టైటిల్ అంటే... యువతలో పిచ్చ క్రేజ్. ‘ఇడియట్’

పూరి జగన్నాథ్ సినిమా అంటే.. టైటిల్ నుంచే చర్చ మొదలు. హీరో స్వభావాన్ని బట్టి ఆయన పెట్టే టైటిల్ అంటే... యువతలో పిచ్చ క్రేజ్. ‘ఇడియట్’ నుంచి అలా అలోచించడం మొదలుపెట్టారాయన. పోకిరి, దేశముదురు, చిరుత, నేనింతే... ఇవన్నీ ఆ కోవకు చెందిన టైటిల్సే. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో టైటిల్ చేరబోతోందని సమాచారం. అదే ‘టెంపర్’. ఈ టైటిల్‌ని బట్టి హీరో పాత్రని పూరీ ఎలా డిజైన్ చేసి ఉంటారో ఊహించేసుకోవచ్చు. పైగా ఇందులో హీరో ఎన్టీఆర్. ఇక చెప్పేదేముంది? మాస్‌కి పండగే. బండ్ల గణేశ్ ఈ చిత్రానికి నిర్మాత. కుమ్మేస్తా, రుబాబు టైటిల్స్ ఈ సినిమాకు ప్రచారంలో ఉన్నాయి.
 
 అయితే, పూరీ మస్తిష్కంలో మాత్రం ఈ టైటిల్స్ లేవని పూరీ ఆంతరంగికుల సమాచారం. ఈ సినిమాకు పూరీ అనుకున్న టైటిల్స్ నేనో రకం, టెంపర్. ఈ రెండు పేర్లలో ‘టెంపర్’ వైపే పూరీ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అంటే... త్వరలోనే పూరీ-ఎన్టీఆర్ కలిసి తెరపై తమ టెంపర్‌ని చూపించనున్నారన్నమాట. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించనున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక. ఇందులో ఎన్టీఆర్ పోలీస్ అధికారిగా నటించనున్నారట. ఆగస్ట్‌లో ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుంది. జనవరి 9న చిత్రాన్ని విడుదల చేయాలనే సంకల్పంతో పూరీ, బండ్ల గణేశ్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement