పెళ్లి పీటలెక్కనున్న జేడీ | JD Chakravarthy is tying the knot soon | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలెక్కనున్న జేడీ

Apr 18 2016 10:44 AM | Updated on Sep 3 2017 10:11 PM

పెళ్లి పీటలెక్కనున్న జేడీ

పెళ్లి పీటలెక్కనున్న జేడీ

90వ దశకంలో నాగార్జున కెరియర్ ను ఒక మలుపు తిప్పిన'శివ' సినిమా తో తెలుగు సినీ లోకానికి పరిచయమైన జెడీ చక్రవర్తి (46)ఎట్టకేలకు పెళ్లి పీటలెక్క బోతున్నాడు


హైదరాబాద్: 90వ దశకంలో నాగార్జున కెరియర్ ను ఒక మలుపు తిప్పిన 'శివ'  సినిమా తో తెలుగు సినీ లోకానికి  పరిచయమైన జేడీ చక్రవర్తి (46)ఎట్టకేలకు పెళ్లి పీటలెక్క బోతున్నాడు.  హాఫ్ సెంచరీకి దగ్గరిగా ఉన్న ఈ విలక్షణ నటుడికి ఇప్పటికి పెళ్లిచేసుకునే మెచ్యూరిటీ వచ్చిందట. అందుకే  మూడుముళ్ల బంధానికి ఓకే చెప్పానంటున్నాడు.

ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని  మరికొద్దినెలలో జేడీ పెళ్లి చేసుకోనున్నాడు.  ఇప్పటికైనా సెటిల్ అవ్వమనే వాళ్లమ్మ  బలవంతం మీద త్వరలోనే  ఓ ఇంటివాడయ్యేందుకు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. దీనిపై ఈ గులాబీ హీరోని వివరణ కోరాగా 'నేను పెళ్లికి ఎప్పుడూ వ్యతిరేకం అని చెప్పలేదు. పెళ్లి చేసుకోవాలంటే ఎంతో బాధ్యత - మెచ్యూరిటీ ఉండాలి. నాకు ఇప్పడవి వచ్చాయని అనుకుంటున్నా' అంటూ మీడియాకు తన పెళ్లి కబురందించాడు.  
 
జేడీ చక్రవర్తిగా పాపులర్ అయిన  నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి పుట్టింది హైదరాబాద్ లోనే. సినిమా రంగం మీద ఆసక్తితో 1989లో రామ్ గోపాల్ వర్మ  సెన్సేషనల్ మూవీ శివతో తెరంగేట్రం చేసిన చక్రవర్తి అప్పట్లో  కాలేజీ కుర్రకారులోపెద్ద సంచలనం. ఆ తర్వాత గులాబీ, పాపకోసం, హోమం తదితర సినిమాల్లో తన ప్రతిభను రూపించుకుంటూ   హీరోగా, విలన్ గా, దర్శకుడిగా తనదైన శైలిలో రాణించాడు.  'సత్య' మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement