రవికి విజయం ఖాయం! | Jayadev is going to release on 30th of this month. | Sakshi
Sakshi News home page

రవికి విజయం ఖాయం!

Jun 28 2017 11:04 PM | Updated on Sep 5 2017 2:42 PM

రవికి విజయం ఖాయం!

రవికి విజయం ఖాయం!

‘‘నా వందో చిత్రంలో హీరో బన్నీ అని ఎప్పుడో డిసైడ్‌ అయ్యా. అప్పుడు బన్నీ సింగిల్‌ ఏ.. ఇప్పుడు డబుల్‌ ఏ.. బన్నీని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది’’ అన్నారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు.

– దర్శకుడు కె. రాఘవేంద్రరావు
‘‘నా వందో చిత్రంలో హీరో బన్నీ అని ఎప్పుడో డిసైడ్‌ అయ్యా. అప్పుడు బన్నీ సింగిల్‌ ఏ.. ఇప్పుడు డబుల్‌ ఏ.. బన్నీని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది’’ అన్నారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి, మాళవిక జంటగా జయంత్‌ సి. పరాన్జీ దర్శకత్వంలో కె. అశోక్‌కుమార్‌ నిర్మించిన ‘జయదేవ్‌’ ఈ నెల 30న విడుదల కానుంది.


మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌ను విశాఖలో నిర్వహించారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘మనకు మంచి జరగాలని గుళ్లోకి వెళ్లినప్పుడు గంట కొడతాం. గంటా శ్రీనివాసరావుకి అన్నింట్లో జయమే. అలా గంటా రవికి కూడా జయమే. టైటిల్‌లో, డైరెక్టర్‌ పేరులోనూ జయం ఉంది. ఇంతకన్నా ఈ సినిమాకి కావాల్సింది ఏముంది? యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. అల్లు అర్జున్‌ మాట్లాడుతూ– ‘‘గంటా శ్రీనివాసరావుతో మాది పర్సనల్‌గా, పొలిటికల్‌గా లాంగ్‌ జర్నీ. చిరంజీవిగారిపై ఆయనకు ఉండే ఇష్టం నన్ను గంటాను ఎక్కువ ఇష్టపడేలా చేసింది.

మా నాన్న (అల్లు అరవింద్‌) గారికి మంచి ఫ్రెండ్‌ ఆయన. ‘జయదేవ్‌’ రవికి మంచి బ్రేక్‌ ఇచ్చి, గొప్ప భవిష్యత్‌ అవ్వాలని కోరుకుంటున్నా. సభాముఖంగా జయంత్‌గారు అని పిలుస్తున్నాను. కానీ పార్టీలో, పబ్బుల్లో మేమిద్దరం వేరేలా పిలుచుకుంటాం. మేం అంత క్లోజ్‌ ఫ్రెండ్స్‌’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి, వారి అబ్బాయిని నా చేతుల్లో పెట్టినందుకు గంటా శ్రీనివాసరావు, శారదలకు కృతజ్ఞతలు. రవి, మాళవికలకు మనస్ఫూర్తిగా ప్రేక్షకుల ఆశీర్వాదాలు కావాలి’’ అన్నారు జయంత్‌ సి. పరాన్జీ.‘‘మ్యూజిక్‌ సూపర్‌హిట్‌ అయింది. ప్రతి ఒక్కరూ ‘జయదేవ్‌’ గురించి మాట్లాడుతున్నారు.

నాకు, జయంత్‌కి ఇది హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది’’ అన్నారు అశోక్‌కుమార్‌. గంటా రవి మాట్లాడుతూ – ‘‘ఈరోజు నేనీ స్టేజిపై నిలబడ్డానంటే కారణం నా తల్లిదండ్రులే. నన్ను నమ్మి నాకు ఈ అవకాశమిచ్చిన జయంత్‌గారు, అశోక్‌కుమార్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు దంపతులు, కథానాయిక మాళవిక, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు, కెమెరామేన్‌ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement